Wednesday, May 14, 2025
Homeజాతీయంపాక్‌ దాడిచేస్తే..వినాశకరంగా ప్రతిస్పందిస్తాం

పాక్‌ దాడిచేస్తే..వినాశకరంగా ప్రతిస్పందిస్తాం

- Advertisement -

– అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మోడీ
న్యూఢిల్లీ:
భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వీటికి ముగింపు పలికేందుకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అమెరికా ముందుకొస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇటీవల సంప్రదింపులు జరిపారనే వార్తలు వచ్చాయి. ఆ క్రమంలో పాకిస్తాన్‌ ఒకవేళ భారత్‌పై దాడి చేస్తే ప్రతిస్పందన అత్యంత దారుణంగా, వినాశకరంగా ఉంటుందని జేడీ వాన్స్‌కు ప్రధాని మోడీ స్పష్టం చేసినట్టు అమెరికా మీడియా కథనం వెల్లడించింది. ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చితే పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందని ప్రధాని మోడీతో జేడీ వాన్స్‌ పేర్కొన్నట్టు తెలిసింది. దీనికి మోడీ బదులిస్తూ.. పాకిస్తాన్‌ ఎటువంటి దాడులూ చేయకుంటే తాము కూడా సంయమనం పాటిస్తామని చెప్పినట్టు సమాచారం. ”ఒకవేళ పాకిస్తాన్‌ ఏదైనా చేస్తే.. ప్రతిస్పందన అత్యంత దారుణంగా, వినాశకరంగా ఉంటుంది” అని జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ అన్నట్టు అమెరికా మీడియా కథనం వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -