మాస్కో: ఈ నెల 15న ఇస్తాంబుల్‌లో రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించారు. ఎలాంటి ముందస్తు షరతులూ లేకుండా ఉక్రెయిన్ ఈ చర్చల్లో పాల్గొనాలని పుతిన్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన విలేకరులో సమావేశంలో పుతిన్ ఈ ప్రతిపాదన చేశారు. ఉక్రెయిన్‌తో చర్చలకు తాము కట్టుబడి ఉన్నట్టు, ఈ ప్రత్యక్ష చర్చల సందర్భంగా తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశాన్ని తాము తోసిపుచ్చడం లేదని చెప్పారు. సంక్షోభం ముగింపునకు రష్యా ఎంతగా చొరవ తీసుకుంటున్నా.. ఉక్రెయిన్ వీటిని పదే పదే దెబ్బతీస్తోందనీ, రష్యాపై దాడులను ప్రారంభిస్తుందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ తన సైన్యంలోకి మరింత మందిని చేర్చుకోవడానికి, ఆయధాలు సమకూర్చుకోవడానికి, సమీకరించుకోవడానికి అనుమతించే ఒప్పందం కాకుండా ‘శాశ్వత శాంతి’కి దారితీసే ఒప్పందం అవసరమని పుతిన్ ఆదివారం మరోసారి పునరుద్ఘాటించారు. ఈ నెల 15న శాంతి చర్చలను సులభతరం చేయాలని టర్కీ అధ్యక్షులు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో మాట్లాడతానని పుతిన్ చెప్పారు. 2022లో ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయాన్ని పుతిన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, చర్చలపై క్రెమ్లిన్ విదేశాంగ శాఖ సహాయకులు యూరి ఉషాకోవ్ మాట్లాడుతూ ఈ ప్రత్యక్ష చర్చల్లో క్షేత్రస్థాయి పరిస్థితినీ, అలాగే 2022 చర్చలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కాగా, పుతిన్ చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ స్వాగతించారు. అయితే చర్చలు ప్రారంభమయ్యే నాటికి కాల్పుల విరమణ అమల్లో ఉండాలని కోరారు. అలాగే ఈ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ స్పందిస్తూ ‘రష్యా, ఉక్రెయిన్‌లకు గొప్ప రోజు’ అని పేర్కొన్నారు.
15న ఇస్తాంబుల్‌లో రష్యా, ఉక్రెయిన్ ప్రత్యక్ష చర్చలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES