Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఆగని ఇజ్రాయిల్‌ దాడులు

ఆగని ఇజ్రాయిల్‌ దాడులు

- Advertisement -

– గాజాలో 9 మంది మృతి
– మహిళలు, పిల్లలే అధికం
గాజా:
గాజాపై ఇజ్రాయిల్‌ అమానుషదా డులు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఇజ్రాయిల్‌ చేపట్టిన దాడుల్లో తొమ్మిమంది మరణించారు. వారిలో అధికంగా మహిళలు, పిల్లలు ఉన్నారని స్థానిక ఆరోగ్య అధికా రులు తెలిపారు. దక్షిణ నగరమైన ఖాన్‌యూనిస్‌ లోని తాత్కాలిక శిబిరాలపై ఇజ్రాయిల్‌ రెండు దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇద్దరు పిల్లలు సహా వారి తల్లిదండ్రులు మరణించారు. మూడో దాడిలో మరో చిన్నారి మరణించాడని, మరో ఏడుగురు గాయపడ్డారని నాజర్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ దాడులపై ఇజ్రాయిల్‌ స్పందించాల్సి వుంది. పదివారాలుగా గాజాలోకి సాయం వెళ్ల కుండా ఇజ్రాయిల్‌ అడ్డుకుంది. ఆహారం, మందు లు, ఇతర నిత్యావసరాలతో కూడిన దిగుమతుల ను రాకుండా అన్ని దారులను మూసివేసింది. ఆహార నిల్వలు తగ్గిపోతున్నాయని సహాయక బృందాలు పేర్కొన్నాయి. ఆకలితో అధికమంది మరణించవచ్చని హెచ్చరిస్తున్నాయి. సాయం అందేలా చూడాల్సిందిగా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచాలని ప్రపంచదేశాలను కోరుతున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad