నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాది చివరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో AIADMK భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎంపీ అన్వర్ రాజన్న డీఎంకే పార్టీలో చేరారు. ద్రావిడ మున్నేట్ర కజకం అధినేత, సీఎం స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
AIADMK బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తనకు ఇష్టం లేదని, ఈ నిర్ణయం తమిళనాడు లక్ష్యాలకు విరుద్దంగా ఉందని మీడియా సమావేశంలో ఎంపీ అన్వర్ రాజన్న అన్నారు. ఈ పొత్తు వల్ల తమిళనాడుకు నష్టమే జరుగుతుందని, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టంచడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. అందుకు పావుగా AIADMKను వాడుకుంటుందని విమర్శించారు. అంతేకాకుండా AIADMK ప్రధాన సిద్ధాంతం నుండి వైదొలిగి, బీజేపీ నియంత్రణలో ఉందని విమర్శించారు. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీని “ప్రతికూల శక్తిగా అభివర్ణించారని, ఎన్డీఏ సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. కానీ ఒక్క చోట కూడా అమిత్ షా ఎడప్పాడి పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రస్తావించలేదని ఎద్దేవా చేశారు.