- Advertisement -
నవతెలంగాణ కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైల్వేస్టేషన్ సమీపంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. చెత్తకుప్పలో ఉన్న నాటుబాంబును వీధి కుక్క కొరకడంతో అది పేలింది. ఈ ఘటనలో కుక్క మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. చెత్తకుప్పలో మరో4 నాటుబాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -



