రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీ
ఉద్యానవన అధికారి వై.మణి
నవతెలంగాణ – మల్హర్ రావు
మహదేవ్‌పూర్ డివిజన్ లోని మల్హర్ రావు, మహాముత్తారం, కాటారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో సుమారుగా 250 ఎకరాల్లో కురగాయల సాగు జరుగుతోందని, కూరగాయల సాగును ప్రోత్సహించడానిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యానవన ప్రణాళిక” కింద కూరగాయల విత్తనాలు రైతులకు 50% సబ్సిడీని అందించే కొత్త చొరవను ప్రారంభించిందని మహాదేవపూర్ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి వై మణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఈ పథకం కింద కూరగాయల రైతులకు 1 హెక్టారుకు రూ.24 వేల సబ్సిడీగా అందించబడుతుందని తెలిపారు. అదే విధంగా పండ్ల సాగును ప్రోత్సహించడానికి “మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం” కింద ఆసక్తి ఉన్న ఫార్మాట్‌లకు 50% సబ్సిడీ అందించబడుతుందన్నారు. ఈ సబ్సిడీలు పొందాలంటే రైతు దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోను జిల్లా ఉద్యానవన కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. మండలంలోని కిషన్‌రావు పల్లి గ్రామంలో కూరగాయల పెంపకంపై అవగాహన సమావేశం ఇటీవల నిర్వహించారు. ఈ అవగాహన సమావేశంలో రైతులకు ఇతర సబ్సిడీ విధానాలను వివరించారు.



