నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ కలకలం రేపింది. మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించింది. బిహార్‌కు చెందిన మహమ్మద్ అనే యువకుడు ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడే అతడు ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నాడు. శనివారం రాత్రి మహమ్మద్ ఓ బ్యాగ్‌తో మూసాపేట మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. సాధారణ స్కానింగ్‌లో భద్రతా సిబ్బంది తనిఖీలు చేయగా.. బీప్ శబ్దం వచ్చింది. మహమ్మద్ వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. 9 ఎంఎం బుల్లెట్ లభించింది. వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
మెట్రో స్టేషన్‌లో బుల్లెట్ కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES