Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. వర్ధమాన క్రికెటర్ మృతి

ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. వర్ధమాన క్రికెటర్ మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జమ్మూకాశ్మీర్‌లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో వర్ధమాన క్రికెటర్ మ‌ర‌ణించాడు. ఆగస్టు 20న స్కూటర్‌పై నెమ్మదిగా రహదారిపై వెళ్తుండగా ఆగి ఉన్న కారు డోర్ సడన్‌గా తీయడంతో స్కూటర్ కింద పడిపోయింది. దీంతో ఫరీద్ హుస్సేన్ కోమాలోకి వెెళ్లారు. కరెక్ట్‌గా స్కూటర్ కారు దగ్గరకు వచ్చినప్పుడు డోర్ తెరిచాడు. దీంతో స్కూటర్‌ను కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించలేదు. తలకు బలమైన గాయాలు తగలడంతో ఫరీద్ హుస్సేన్ చికిత్స పొందుతూ చనిపోయాడు.

స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. వైద్యులు కాపాడలేకపోయారు. నాలుగు రోజులుగా చికిత్స అందిస్తున్నా లాభం లేకుండా పోయింది. శనివారం మరణించినట్లు చెప్పారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad