Monday, December 22, 2025
E-PAPER
Homeజాతీయంచెత్తకుప్పలో పిల్లాడికి దొరికిన బొమ్మ..కలకలం రేపుతున్న చైనా గుర్తులు

చెత్తకుప్పలో పిల్లాడికి దొరికిన బొమ్మ..కలకలం రేపుతున్న చైనా గుర్తులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: జమ్మూ కశ్మీర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రాంతీయ కార్యాలయం సమీపంలో చైనా తయారీకి చెందిన ఒక శక్తిమంతమైన రైఫిల్ స్కోప్ (టెలిస్కోప్) లభించడం కలకలం రేపింది. ఈ ఘటనతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థ కార్యాలయానికి సమీపంలోనే ఇలాంటి యుద్ధ పరికరాలు దొరకడం కలకం రేపింది. జమ్మూ శివారులోని సిద్రా ప్రాంతంలోని అస్రారాబాద్ గ్రామంలో ఆరేళ్ల బాలుడు ఒక వింత వస్తువుతో ఆడుకుంటుండగా స్థానికులు గమనించారు. ఆ చిన్నారి దానిని బొమ్మ అనుకొని ఆడుకుంటుండగా, అది తుపాకీకి అమర్చే టెలిస్కోప్ అని గుర్తించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఉదయం ఒక చెత్త కుప్పలో ఆ వస్తువు దొరికిందని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో అది చైనాలో తయారైన రైఫిల్ స్కోప్ అని తేలింది. దీనిని అసాల్ట్ రైఫిళ్లకు లేదా స్నిపర్ రైఫిళ్లకు అమర్చి సుదూర లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు.ఎన్ఐఏ కార్యాలయంతో పాటు జమ్మూ కశ్మీర్ పోలీసు సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ బెటాలియన్ కేంద్రాలు ఉన్న అత్యంత కీలక ప్రాంతంలో ఇది దొరకడం భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు జమ్మూలోని సాంబా జిల్లాలో 24 ఏళ్ల తన్వీర్ అహ్మద్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ నివాసి అయిన తన్వీర్ మొబైల్‌లో ఒక పాకిస్థానీ ఫోన్ నంబర్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతడికి ఈ స్కోప్ దొరకడంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -