Friday, October 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈ పండుగ సీజన్ కోసం ఒక కన్స్యూమర్ సురక్షా మార్గదర్శకం

ఈ పండుగ సీజన్ కోసం ఒక కన్స్యూమర్ సురక్షా మార్గదర్శకం

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: పెద్ద పండుగలు షాపర్లకు పెద్ద చిట్టాలు సిద్ధం చేసుకునేందుకు స్ఫూర్తిని ఇస్తే, మోసగాళ్ళకు పెద్ద అవకాశాలు ఇస్తాయి. మీ సీజనల్ షాపింగును ఏదో ఒక ముఖ్యమైన ప్రయాణంగానే భావించండి: మార్గం ప్లాన్ చేసుకోండి, విశ్వసనీయమైన రోడ్లను ఉపయోగించండి, అమూల్యమైన మీ వస్తువులను భద్రంగా ఉంచుంకోండి. ఈ క్రింద ఒక ఆచరణాత్మకమైన, నిపుణుల తరహా చెక్­లిస్ట్ ఉన్నది. ఇది విశ్వజనీనమైన భద్రత కోసం ఉత్తమమైన పద్ధతులను, అమెజాన్ లాంటి కంపెనీలు ఏ విధంగా తమ సురక్షాకవచాలను పటిష్టపరుచుకుని మీరు తక్షణం ఉపయోగించుకునేందుకు టూల్సును ఆఫర్ చేస్తున్నాయో తెలిపే ఉదాహరణలతో మేళవిస్తుంది.

“మీరు చెల్లింపు జరిపేందుకు ముందు వెబ్­సైట్లను తనిఖీ చేయటం, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్­ ఆన్ చేయటం, బ్యాంకు స్టేట్­మెంట్లను చెక్ చేసుకోవటం, ఏదైనా అనుమాన్పదంగా ఉంటే ఫిర్యాదు చేయటం వంటి కొన్ని అలవాట్లు, ప్రమాదావకాశాలను నాటకీయంగా తగ్గించివేస్తాయి. మా వంతు పని మేము తెరవెనుక ఉండి చేస్తున్నాము; స్క్రీన్ ముందు తమ వంతు పని చేయవలసిందిగా మేము కన్స్యూమర్లను ఆహ్వానిస్తున్నాము,” అని రాకేష్ బక్షి, వైస్ ప్రెసిడెంట్ – లీగల్, అమేజాన్ ఇండియా అన్నారు.

అమెజాన్ వంటి కంపెనీలు సురక్షితమైన ఈమెయిల్ సిగ్నల్స్ (అందుకే అసలైన సందేశాలు అమెజాన్ స్మైల్ ఐకన్­ను ప్రైమరీ ఇన్­బాక్సులలో చూపుతాయి)లో, ప్రజా-విద్యా భాగస్వామ్యాలు, ఇంకా ప్రత్యేకించిన ఇన్వెస్టిగేటర్లు మరియు ఒక స్థాయి షాపర్లను రక్షించేందుకు కృషి చేసే మెషీన్ లెర్నింగ్ నిపుణుల పై పెట్టుబడి పెడుతున్నాయి. తత్ఫలితంగా మీకు లభిస్తోంది: “యాడ్ టు కార్ట్ ” మొదలుకుని “ఎరైవ్డ్” వరకు ఒక ఆటంకాలు లేని, సురక్షితమైన మార్గం.

అమేజాన్ ఇండియా వారి మోసాలు లేని సెప్టెంబర్ ను పాటించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), హోం వ్యవహారాల శాఖతో భాగస్వామ్యం ద్వారా ఈ ప్రయత్నం మరింత శక్తివంతంగా మారింది. తెలివిగా మరియు సురక్షితంగా కొనుగోళ్లు చేయడానికి వారికి అవసరమైన విజ్ఞానం వినియోగదారులకు కలిగించడానికి I4Cతో, అమేజాన్ మీడియాలో అవగాహనా కార్యక్రమాలను మరియు డిజిటల్ ప్లాట్ ఫాంలను నిర్వహిస్తోంది. కఠినమైన మోసపూరితమైన పరిస్థితులను సులభంగా అర్థం చేసుకునే భద్రతా సలహాలుగా మార్చే మూడు ఫిల్మ్స్ ను కూడా ఇది విడుదల చేసింది.

ఫిల్మ్స్ ఇక్కడ చూడండి – ఫిల్మ్ 1, ఫిల్మ్ 2, ఫిల్మ్ 3

సురక్షితమైన షాపింగుకు సత్వర మార్గదర్శిని
విషయాలను తెలుసుకోండి: విశ్వసనీయమైన లెర్నింగ్ హబ్ లో ఐదు నిముషాలు గడపండి. అమెజాన్ వారి ప్రొటెక్ట్ & కనెక్ట్ మైక్రోసైట్ సాధారణమైన మెళకువలను సులభమైన భాషలో వివరించి చెబుతుంది, సంభాషణాత్మకమైన క్విజ్­ల ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించుకునేందుకు వీలు కల్పిస్తుంది. MFA ప్రాధాన్యమేమిటో, ఫిషింగ్ ఎలా పనిచేస్తుందో, ఏదైనా పక్కతోవ పడితే ఏమి చేయాలో మీరు నేర్చుకోగలుగుతారు.
వెబ్­సైట్ యొక్క అథెంటిసిటీని తనిఖీ చేయండి: ఏవైనా క్రెడెన్షియల్స్ లేదా పేమెంటు వివరాలను ఎంటర్ చేయటానికి ముందు, URL (మీరు కోరుకున్న అసలైన డొమెయిన్ అవునా?)ను తనిఖీ చేయండి, https కోసం మరియు లాక్ ఐకన్ కోసం చూడండి, టైపోస్క్వాటింగ్ (ఉదా., “amazo.co”) విషయంలో జాగ్రత్త వహించండి. ఒక ఆర్డర్ లేదా అకౌంటును గురించి ఏదైనా మెసేజ్ మీకు అందితే, ఆ లింకు పై క్లిక్ చేయవద్దు – అమెజాన్ యాప్ తెరవండి లేదా వెబ్­సైట్­కు డైరెక్ట్­గా వెళ్ళి యువర్ ఆర్డర్స్­ను కన్ఫర్మ్ చేయండి.
లావాదేవీలు జరిపేందుకు పబ్లిక్ వై-ఫై­లను ఉపయోగించవద్దు : ఓపెన్ నెట్­వర్కుల పై దాడి చేయటం, అక్కడ జరిగేవి తెలుసుకోవటం లేదా మిమ్మల్ని తప్పుడు పేజ్­లకు మళ్ళించటం, అటాకర్లకు సులభం అవుతుంది. కొనుగోళ్ళను మరియు బ్యాంకింగును కేవలం నమ్మకమైన కనెక్షన్ల ద్వారా మాత్రమే జరపండి. MFAను ఉపయోగించటాన్ని పరిగణించండి. అందువల్ల, మీ అకౌంట్లను యాక్సెస్ చేయటానికి కేవలం పాస్­వర్డ్ మాత్రమే సరిపోదు.
విక్రేతలను మరియు రివ్యూలను తనిఖీ చేయండి: స్టార్ రేటింగులకు ఆవల ఉన్నదానిని చదవండి; ఇటీవలి రివ్యూలను మరియు ప్రశ్నోత్తరాలను స్కాన్ చేసి మీ అవసరాలకు కావలసిన ప్రత్యేకమైన వివరాలను తెలుసుకోండి. అమెజాన్­తో ఆధికారిక యాప్ అనుభవాన్ని పొందండి – ఇక్కడ మీరు ట్రాకింగ్, రిటర్న్ ఆప్షన్లు, కస్టమర్ సపోర్ట్ పొందుతారు. అంతేకాని, సోషల్ ప్లాట్­ఫారంలలో తిరుగుతున్న థర్డ్-పార్టీ లింకులను పంపదు. తన A-టు-Z గ్యారెంటీ తో అమెజాన్ కొనుగోళ్ళకు దన్నుగా నిలుస్తుంది.
అవాంఛనీయమైన సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండండి: “అర్జెంట్” కాల్స్/టెక్స్ట్­లు/ఈమెయిల్సును పొగ అలారంలుగా భావించి, ఆగి చూడండి మరియు పరిశోధించండి. ఫోను లేదా ఈమెయిల్ ద్వారా అమెజాన్ చెల్లింపు జరపమని అడగదు, గిఫ్ట్ కార్డుల కోసం డిమాండ్ చేయదు, సపోర్ట్ కోసం సాఫ్ట్­వేర్­ను ఇన్­స్టాల్ చేయమని అడగదు. ఒకవేళ మీకు ఏదైనా సందేహంగా ఉంటే, ముందుకు సాగవద్దు, ఫిర్యాదు చేయండి.
సురక్షితమైన చెల్లింపు పద్ధతులను ఉపయోగించండి : అమెజాన్ యాప్ లేదా వెబ్­సైట్­లో మాత్రమే చెల్లింపు జరపండి. అవాంఛనీయమైన ప్రామ్ట్­ల నుండి ప్రారంభించిన లావాదేవీలతో ప్రత్యక్షంగా బ్యాంక్ ట్రాన్స్­ఫర్లను జరపవద్దు. OTPలు లేదా 2FA కోడ్­లను ఎవ్వరికీ షేర్ చేయవద్దు.
పాప్-అప్­లు మరియు మళ్ళించే లింకుల విషయంలో జాగ్రత్త వహించండి: ఒకవేళ ఏదైనా పేజ్ బౌన్స్ అవుతూ ఉంటే, దానిని మూసివేసి, మీ బుక్­మార్కుల నుండి మరలా నావిగేట్ చేయండి లేదా తాజాగా సెర్చ్ చేయండి. సమాచారాన్ని ఎంటర్ చేయటానికి ముందు, ప్రతిసారి అడ్రస్­ బార్­ను తనిఖీ చేయండి.
సీదులు మరియు కన్ఫర్మేషన్లను ఒకే ఫోల్డర్­లో భద్రపరచండి, సీజన్­లో వారానికి ఒకసారి బ్యాంకు /UPI స్టేట్­మెంట్లను రివ్యూ చేసుకోండి—తేడాలను మీరు త్వరగా గమనించగలుగుతారు, విధించే ఛార్జ్­ల విషయాన్ని తక్షణమే లేవనెత్తగలుగుతారు.
విషయాలను తెలుసుకుని ఉండండి & ఫిర్యాదు చేయండి : ఒకవేళ మీరు ఏదైనా చూస్తే, ఏదైనా చెప్పండి. అమెజాన్ వారి సెల్ఫ్-సర్వీస్ టూల్ ఉపయోగించి, అనుమాన్పదమైన కాంటాక్టును గురించి ఫిర్యాదు చేయండి; కస్టమర్లు కాని వారు [email protected]కు ఈమెయిల్ చేయవచ్చు. [email protected]కు ఫిషింగ్ ఈమెయిల్సును ఫార్వార్డ్ చేయండి. చేసిన ప్రతి ఫిర్యాదు సహాయంతో అమెజాన్, ప్యాటర్న్­లను గుర్తించి, చెడు ఇన్ఫ్రాస్ట్రక్చర్­ను తొలగించేందుకు సహాయపడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -