నవతెలంగాణ-గోవిందరావుపేట
వరద ఉధృతి నుండి రైతులను, అభ్యుదయ కాలనీ వాసులను కాపాడాలి. గుండ్లవాగుపై కరకట్ట నిర్మించడం ద్వారా అభ్యుదయ కాలనీ వాసులను రక్షించుకోవచ్చని పసర రాంపూర్ శివారులోని భూములు వరద ముంపుకు గురికాకుండా ఉంటాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదిల్ల చిట్టిబాబు అన్నారు. సోమవారం గోవిందరావుపేట మండలం పసర గ్రామానికి చెందిన కోట కాలువ చివరి ఆయకట్టు రైతులు మరియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమ మల్లారెడ్డి పొదిల చిట్టిబాబు ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ కు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రొడ్డు వాగు ఉప్పొంగడం వలన గుండ్ల వాగును ఆనుకుని ఉన్నటువంటి పంట పొలాలు వరద ముంపుకు గురవుతున్నాయని అభ్యుదయ కాలనీలోకి వరద వస్తుందని తెలిపారు. దీని ద్వారా ప్రజలకి తీరని నష్టం వాటిల్లుతుందని అన్నారు.కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి సప్రయోజనం కోసం కోట కాలువ క్రింద రెండు మీటర్ల ఎత్తుతో వాల్ నిర్మించాలని దరఖాస్తు చేయడం హాస్యాస్పదమని అన్నారు . ఈ వాల్ నిర్మిస్తే 200 ఎకరాలు సేద్యం భూమి ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు .పేద రైతులు వీధిన పడతారని అన్నారు. ఈ విషయంలో మంత్రి సీతక్క కు మరియు అధికారులకు వారు ఇచ్చిన దరఖాస్తును పరిగణలోకి తీసుకోవద్దని సూచించారు. గుండ్లవాగుపై కరకట్ట నిర్మించడం ద్వారా రైతుల పొలాలు ముంపుకు గురికాకుండా ఉంటాయని అదేవిధంగా అభ్యుదయ కాలనీ రాజీవ్ కాలనీకి వరద తాకిడి ఉండదని తెలిపారు. పొలాల నుండి వరద నివారించడానికి గుండ్ల వాగు పై కరకట్ట నిర్మించడం ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు .అదేవిధంగా జాతీయ రహదారి 163 పై పసర సీడ్ మిల్లు నుండి సబ్ స్టేషన్ వరకు బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. దీని ద్వారా మాత్రమే పసర గ్రామాన్ని వరద ముంపు నుండి కాపాడుకోగలుగుతామని వారు తెలిపారు.కొంతమంది రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూములకు డిమాండ్ రావడం కోసం అధికారులను పక్కదోవ పట్టిస్తున్నారని తెలిపారు.ఈ విషయంలో ప్రభుత్వం రైతులు మరియు అభ్యుదయ కాలనీ రాజీవ్ కాలనీవాసుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని సమస్యను జటిలము కాకుండా పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు సామ శ్రీనివాస్ రెడ్డి ,మేడ సైదిరెడ్డి ,రామిడి ప్రతాపరెడ్డి, సామ రమేష్ రెడ్డి. గండికోట శ్రీనివాస్, కోటేష్, భాష, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గుండ్ల వాగు ఒడ్డుకు కరకట్ట నిర్మించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES