సిద్ధార్థ్ హీరోగా నటించిన 40వ చిత్రం ‘3 బిహెచ్కె’. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ,’ ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చిన కథ. ఈ సినిమా చూసిన తర్వాత వెంటనే మా నాన్నని గట్టిగా హగ్ చేసుకోవాలని అనిపించింది. తండ్రీ కొడుకుల రిలేషన్ షిప్‌ని ‘బొమ్మరిల్లు’ సినిమాల్లో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అలాంటి సినిమా తర్వాత మళ్ళీ తండ్రీ కొడుకుల రిలేషన్‌ని ఇందులో చూస్తారు. మీ ఫ్యామిలీని తీసుకుని థియేటర్స్‌కి వెళ్ళండి. వాళ్ళని హగ్ చేసుకోవడానికి మీ పక్కనే ఉంటారు. శ్రీ గణేష్ అద్భుతమైనర రైటర్, డైరెక్టర్. తను ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఈ సినిమాని కళాతపస్వి కె.విశ్వనాథ్‌కి అంకితం చేస్తున్నాం. సినిమాని రిలీజ్ చేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూషన్ వారికి ధన్యవాదాలు’ అని అన్నారు.
‘ఇది నా రియల్ లైఫ్‌కి చాలా కనెక్ట్ అయ్యే సినిమా. మనందరం కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇల్లు అనేది అందరి కల. ఈ సినిమాతో చాలా రిలేట్ అవుతున్నాను. ఇల్లు కట్టాలని అందరికీ యాంబిషన్ ఉంటుంది. ఇల్లు అనేది ఒక గౌరవం. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చుని చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాలో యాక్టర్లు కాదు క్యారెక్టర్లే కనిపిస్తాయి’ అని శరత్ కుమార్ చెప్పారు. డైరెక్టర్ శ్రీ గణేష్ మాట్లాడుతూ,’ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ముందు తీసుకురావడం నాకు ఒక బిగ్ ఎచీవ్మెంట్. చాలా ప్రేమతో ఈ సినిమా తీశాం. మీరందరూ కూడా చూసి అంత ప్రేమ మాకు అందిస్తారని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.
సకుటుంబంగా చూసే సినిమా
- Advertisement -
- Advertisement -