Sunday, May 4, 2025
Homeజాతీయంజమ్మూకశ్మీర్‌లో మరో ఘోర ప్రమాదం..!

జమ్మూకశ్మీర్‌లో మరో ఘోర ప్రమాదం..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్ము కాశ్మీర్లో మరో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లోని దాల్ సరస్సులో… పెను ప్రమాదం చోటుచేసుకుంది. దాల్ సరస్సులో పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు బోల్తా కొట్టింది. బలమైన గాలులు వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతుంది. దీంతో జమ్మూ కాశ్మీర్లో మరోసారి.. ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక బోటు బోల్తా కొట్టడంతో ప్రాణ భయంతో కేకలు వేశారు ప్రయాణికులు. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ టీం సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. గత పది రోజుల కిందట జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, 26 మంది స్వదేశీయులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -