Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంత‌ప్పిన ఘోర విమాన ప్ర‌మాదం..

త‌ప్పిన ఘోర విమాన ప్ర‌మాదం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: చెన్నైలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. మలేషియా కౌలాలంపూర్‌ నుంచి వచ్చిన ఓ కార్గో ఫ్లైట్‌ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. రన్‌వేపై ఫ్లైట్‌ ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ అధికారులకు అలర్ట్‌ ఇచ్చారు. అయితే, విమానం సేఫ్‌గానే ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్‌ అలర్ట్‌తో అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఎవరికీ గాయాలు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -