Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎకరాల కొద్ది రెవెన్యూ భూమి హమ్ ఫట్ 

ఎకరాల కొద్ది రెవెన్యూ భూమి హమ్ ఫట్ 

- Advertisement -

ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తాహసిల్దార్
నవతెలంగాణ – గోవిందరావుపేట

రెవెన్యూ రికార్డుల్లో మూడు ఎకరాల 20 కుంటలు సాగుకు సిద్ధం చేసింది సుమారు 35 ఎకరాలు రికార్డులో ఉన్న పేదల భూమిని సైతం కబ్జా చేసిన విధానం మండలంలోని చల్వాయి గ్రామంలో గౌరారం చెరువు ఏరియా ప్రాంతంలో సుమారు 35 ఎకరాలకు పైగా విస్తీర్ణం గల రెవెన్యూ భూమి కబ్జాకు గురి అయిందని స్థానిక రైతులు తెలుపుతున్నారు. చల్వాయి గ్రామంలో గౌరారం చెరువు ఏరియా ప్రాంతంలో సర్వే నబర్ 124 ఎం/1/ఆ.లో  సైదాబీ వైఫ్ ఆఫ్  సలీం  పేరుమీద రెవెన్యూ రికార్డుల్లో  3-20 మూడు ఎకరాల 20 గుంటల భూమి ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు సుమారు 35 ఎకరాలలో పొదలు వృక్షాలను సహితం తొలగించి సాగుకు సిద్ధం చేసుకున్నారు. ఈ సర్వే నెంబర్ లో ఏం రమేష్ ,జి తామసమ్మ ఇలా పేర్ల మీద కూడా రెవెన్యూ రికార్డుల్లో 1966 నుండ కాస్తు కాలంలో ఉన్నారు.

వీరి పేరా రికార్డుల్లో ఉన్న భూమి కూడా తమదే అంటూ  సైదాబీ కుటుంబ సభ్యులు సాగుకు సిద్ధం చేసుకున్నారు. ఇతర రైతులు పలుమార్లు తాహసిల్దార్ కు మరియు పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్టు చేయడం జరిగింది. ఇరువురిని పిలిపించి మాట్లాడి ఎవరు భూమి వద్దకు వెళ్లకూడదని పోలీసుల సమక్షంలో తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయడం జరిగింది. సైదాబీ కుటుంబ సభ్యులు బైండ్ ఓవర్  బ్రేక్ చేస్తూ మళ్లీ మిగతా చెట్లను కొట్టి సాగుకు సిద్ధం చేశారు. ఈ విషయమై తహసీల్దారును సంప్రదిస్తే రికార్డుల్లో మూడు ఎకరాల 20 గుంటలు మాత్రమే ఉందని, బైండోవర్లు బ్రేక్ చేసిన మాట వాస్తవమేనని సమయం వచ్చినప్పుడు చర్యలు చేపడతామని అంటున్నారు తప్ప ఇప్పటివరకు దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల తామసమ్మ కుటుంబ సభ్యులు తమ భూమిలో గింజలు వేసుకుంటామని వెళ్ళగా ట్రాక్టర్ తో దుక్కి దున్నిస్తున్న సమయంలో సైదాబీ కుటుంబ సభ్యులు అడ్డుకోవడం జరిగింది. కర్రతో కొట్టేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. కర్ర ఎత్తిన ఫోటోలతో సహా మరో మారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారూ . ప్రజావాణిలో కూడా తాము ఫిర్యాదు చేశామని సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వ్యవహార శైలిపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేసి అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూమిని రక్షించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై రూల్స్ ప్రకారం చర్య తీసుకుంటాం: సృజన్ కుమార్, తహసిల్దార్
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై ప్రభుత్వ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని దీనిలో భాగంగా ఇంతకుముందే బైండోవర్ చేయడం జరిగింది బైండ్ ఓవర్ ను బ్రేక్ చేసినట్లు కూడా దృష్టికి వచ్చింది తప్పకుండా చర్యలు చేపడతాం. రికార్డుల ప్రకారం ఉన్న రైతులకు న్యాయం జరుగుతుంది. కబ్జాకు గురైందని చెబుతున్న ప్రభుత్వ భూమిని వెంటనే గుర్తించి స్వాధీనం చేసుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -