రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేశ్ హీరోగా, నిర్మాతగా మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై పవన్ ప్రభ తెరకెక్కించిన చిత్రం షష్టిపూర్తి.. ఈ సినిమాను ఈనెల 30న విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు పవన్ ప్రభ మీడియాతో ముచ్చటించారు.
మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. నాకు అందరి ప్రేమ తెలుసు. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త ఇలా అందరి మధ్య పెరిగాను. కానీ ఇప్పుడు కొందరికి అమ్మానాన్నలు కూడా బరువు అవు తున్నారు. నడి రోడ్డు మీద వారిని వదిలేస్తున్నారు. అమ్మానాన్నల గొప్ప దనాన్ని, ప్రేమ విలువను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాను. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి చూసిన దాని కంటే ఈనెల 30వ తేదీన మీరు సర్‌ప్రైజ్ అయ్యే అంశాలెన్నో సినిమాలో ఉంటాయి.
ఇందులో ఓ స్ట్రిక్ట్ మదర్ ఎలా ఉంటారో అర్చనని అలానే చూపించాను. ఓ జోవియల్ ఫాదర్ ఎలా ఉండాలో రాజేంద్ర ప్రసాద్‌ని కనిపించేలా చిత్రీకరించాను. వీళ్ళిద్దరి నటన మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది.
ఈ చిత్ర ట్రైలర్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమాలో ఏదో విషయం ఉందని అంతా అంటున్నారు. మరీ ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. ఃషష్టిపూర్తిః లాంటి ఎమోషనల్ డ్రామాకి, తల్లిదండ్రుల సెంటిమెంట్ మీద రాసుకున్న కథకు మ్యూజిక్ చాలా ప్రాధాన్యం. అందుకే నేను ఈ చిత్రానికి ఇళయరాజా కావాలని అనుకున్నాను.
ఈ కథ మొత్తాన్ని గోదావరి ప్రాంతంలోనే తీశాను. ఈ కథ విన్న రూపేశ్ సినిమా నిర్మిస్తానని ముందుకొచ్చారు. ఆయన వల్లే ఇళయరాజాని కలిశాను. ఆయన అద్భుతమైన ట్యూన్లు ఇచ్చారు. అన్ని పాటల్ని క్షణాల్లో కంపోజ్ చేసి ఇచ్చారు. చైతన్య ప్రసాద్, రెహమాన్, కీరవాణి మంచి పాటలు రాశారు.
రూపేశ్, ఆకాంక్ష ఇద్దరూ అద్భుతంగా నటించారు. రూపేశ్ కారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆకాంక్ష అచ్చమైన తెలుగమ్మాయి పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.
ఃషష్టిపూర్తిః అనేది పూర్తిగా కల్పిత చిత్రమే. ఇందులో ఉండే పాత్రల్లా బయట బతకలేరు. ఇలాంటి చిత్రాల్ని డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం కష్టం. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా మా సినిమా రాబోతోంది. కొన్ని రోజుల పాటు ఈ చిత్రం అందరినీ వెంటాడుతుంది. ఈ చిత్రం పెరుగన్నం లాంటిది. సెన్సార్ వాళ్లు మా చిత్రానికి ఒక్క కట్ కూడా చెప్పలేదు.
తల్లిదండ్రుల విలువను చాటే చిత్రం
- Advertisement -
- Advertisement -