‘నిజానికి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్‌లో హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదు. కానీ డైరెక్టర్ శైలేష్ కొలను బ్రిలియంట్ రైటర్. మీరు ‘హిట్, హిట్ 2′ సినిమాలు గమనిస్తే ఒక్కొక్క సినిమాకి హీరోయిన్ క్యారక్టరైజేషన్‌లో చాలా ఇంపార్టెన్స్ పెరిగి ఉంటుంది. కథలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా బ్లెండ్ అయి ఉంటుంది. ఇందులో కూడా హీరోయిన్ క్యారెక్టర్‌ని చాలా బాగా బెటర్ చేశారు. కథలో చాలా మంచి కనెక్షన్ ఉంటుంది. నా పాత్రకు కథలో ఎంత ఇంపార్టెంట్ ఉందో సినిమా చూస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది’ అని కథానాయిక శ్రీనిధి శెట్టి చెప్పారు. నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘హిట్ 3 : ద థర్డ్ కేస్’. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఇందులో మదుల అనే పాత్రలో కనిపిస్తాను. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మీరు టీజర్, ట్రైలర్‌లో ఇప్పటికే చూశారు. ఇంటెన్స్ వైలెన్స్‌తో కూడిన క్యారెక్టర్ అది. వైలెన్స్‌తో పాటు ఆ క్యారెక్టర్‌లో చాలా యాంగిల్స్ ఉంటాయి. అర్జున్ సర్కార్‌కి డిఫరెంట్‌గా ఉండే క్యారెక్టర్ మృదుల. మృదుల మాట తప్పితే అర్జున్ సర్కార్ ఇంకెవరి మాట కేర్ చేయరు. మృదులది ఇండిపెండెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌లో కొన్ని లేయర్స్ ఉన్నాయి.
నాని సినిమాలన్నీ చూశాను. నేచురల్ పెర్ఫార్మర్. ఆయనతో వర్క్ చేయడం వెరీ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్. చాలా కంఫర్ట్ ఇచ్చారు. అలాంటి కంఫర్ట్ జోన్ ఇస్తే, పెర్ఫార్మన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఇష్టంగా నా పాత్రకు నేనే తెలుగులో డబ్బింగ్ చెప్పాను. నాని సపోర్ట్‌తో నేను చేసిన ఫస్ట్ తెలుగు సినిమాకి నా వాయిస్ ఉండడం చాలా ఆనందంగా అనిపించింది. ఓ కన్నడ అమ్మాయిలా కాకుండా తెలుగు అమ్మాయిలానే డబ్బింగ్ చెప్పాను.
నాకు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా చేయడం ఫస్ట్ టైం. డైరెక్టర్ శైలేష్ చాలా సపోర్ట్ చేశారు. ప్రతిదీ వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. ఆయన భవిష్యత్తులో అద్భుతమైన సినిమాలు చేసి మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ‘తెలుసుకదా’ అనే మరో తెలుగు సినిమాలో నటిస్తున్నాను.
థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం
- Advertisement -
RELATED ARTICLES