- Advertisement -
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో నిరాశ్రయులకు తమ సొంత చేతులతో వంట చేసి ఘటాడి రామ్, హజారి మనోజ నిరాశ్రయులకు ఆదివారం ఆహారాన్ని అందించారు. వారు ప్రతినిత్యం ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయులుగా పని చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ఖాళీ సమయంలో సామాజిక బాధ్యతగా సామాజిక కృషి లో భాగంగా నిరాశయులకు నిరుపేదలకు ఆహారాన్ని అందిస్తుంటారు. ఆదివారం నగరంలోని పాలు ప్రాంతాలలో నిరుపేద నిరాశ్రయులకు చికెన్ బిర్యాని, చికెన్ రైస్ ని అందించారు. నిరాశ్రయులు మా కడుపుని చల్లగా చూస్తున్నందుకు ఆనందంగా ఉందని నిరాశ్రయులు సంతోషం వ్యక్తం చేశారు.
- Advertisement -



