నవతెలంగాణ – తిమ్మాజిపేట
రంజాన్ నెల నెలవంక దర్శనమివడంతో కొన్ని రోజులుగా రమజాన్ నెల ప్రారంభం ఉపవాస దీక్షలు (రోజా) నిర్వహించుకుంటున్న తరుణంలో ముస్లిం సోదరులకు మాజీ పోలీస్ పటేల్, (ఆవంచ మాజీ పట్వారీ) క్రీ, శే, ఖాజా మొయినుద్దీన్ ఖాన్ నివాసంలో శనివారం రోజు మండల కేంద్రంలో వారి కుమారుల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ముస్లిం సోదరులు రోజా ఉపవాసం దీక్షలు విడిచి మగ్రిబ్ నమాజు చేసిన అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు, ఇఫ్తార్ విందుకు కులమతాలకతీతంగా, పార్టీలకతీతంగా, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో దాదాపు 400 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఖాజా రహీముద్దీన్ ఖాన్, అబ్దుల్ రెహమాన్ ఖాన్, సలాఉద్దీన్ ఖాన్, ఖాజా ఫైసల్ ఖాన్, ఖాజా ఫజల్ ఖాన్, ఆరిఫ్ ఖాన్, అబిద్ ఖాన్, అమెర్ ఖాన్, సల్మాన్ ఖాన్, జియా ఉల్ హక్, మహమ్మద్ ఫరీదుద్దీన్, అహ్మద్ బిన్ తాహెర్, మహమ్మద్ అక్బరుద్దీన్, మహమ్మద్ అబూబక్కర్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ నిజాముద్దీన్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.



