నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల ఉత్తమ ఉపాధ్యాయులకు మండల ఏంఈఓసత్యనారాయణ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించి ఉపాధ్యాయ దినోత్సవం సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మండల తహశీల్దార్ శేఖర్, ఎంపీడీఓ బ్రహ్మానందం పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు సమాజాన్ని ఉద్ధరించే విద్యార్థులను తయారు చేస్తారని, అందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులేన్నాని తెలిపారు. విద్యార్థుల్లో మంచి నడవడికను, సంప్రదాయాలను నేర్పాలని సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ. అశోక్, జీ. దేవన్న, పీర్టీ యు అధ్యక్షులు జి. నగేష్ రెడ్డి, యూటీఎఫ్ జిల్లా భాద్యులు ఎన్. రాజారాం, టీయుపీయుఎస్ రాష్ట్ర భాద్యులు పీ. రామకృష్ణా రెడ్డి, పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు జమిలుల్లా, బిసిటీయు మండల అధ్యక్షులు జి. సంజీవ్, పీఅర్టీయు మండల ప్రధాన కార్యదర్శి పీ. సురేష్ బాబు, యుటీఎఫ్ యూటీఎఫ్ మండల అధ్యక్షులు శంకర్, సురేష్, వెంకట రమణ చారి, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES