Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘన నివాళి

రాజీవ్ గాంధీ విగ్రహానికి ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ 
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలోని నిరుపేదల కోసం ఎంతో కృషి చేశారని రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు.. ఆయన ఆశయాలను ప్రతి నాయకులు, కార్యకర్త లు స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. దేశంలో టెక్నాలజీని పెంపొందించడంతోపాటు, యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి ప్రపంచం దృష్టిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని కొనియాడారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు డిచ్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మాజీ నరేష్ , కాంగ్రెస్ నాయకులు వాసు బాబు, ధర్మ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -