నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు, మాజీ మోడల్ ముకుల్ దేవ్ 54 ఏండ్ల వయసులో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ముకుల్ దేవ్ మరణవార్తను ఆయన సన్నిహితురాలు, నటి దీప్‌శిఖా నాగ్‌పాల్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ముకుల్ దేవ్ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, కొంతకాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని సమాచారం. ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘ఆర్… రాజ్ కుమార్’, ‘జై హో’ వంటి పలు హిందీ చిత్రాలలో ముకుల్ దేవ్ నటించి మంచి గుర్తింపు పొందారు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ చిత్రాలలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. తెలుగులో ప్రభాస్ నటించిన ఎక్ నిరంజన్ సినిమాతో పాటు రవితేజ నటించిన కృష్ణ సినిమాలో నటిచాడు. చివరిగా ‘అంత్ ది ఎండ్’ అనే హిందీ చిత్రంలో కనిపించిడు.
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES