Friday, July 4, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్టాలీవుడ్ లో తీవ్ర విషాదం..

టాలీవుడ్ లో తీవ్ర విషాదం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ ద‌ర్శకుడు ఏఎస్ రవికుమార్ గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటు కారణంగా చివరి శ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా రవి కుమార్ దర్శకుడిగా బాలయ్య, గోపీచంద్ వంటి హీరోలతో మంచి సినిమాల తీసి పేరు తెచ్చుకున్నారు. రవికుమార్ మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రవికుమార్ గోపిచంద్ హీరోగా ‘య‌జ్జం’ మూవీతో ద‌ర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌రువాత బాల‌కృష్ణతో ‘వీర‌భద్ర’, సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, గోపిచంద్‌తో ‘సౌఖ్యం’, నితిన్‌తో ‘ఆటాడిస్తా’ వంటి సినిమాలు తెర‌కెక్కించారు. చివ‌రిగా రాజ్‌త‌రుణ్‌తో ‘తిర‌గ‌బ‌డ‌రా సామి’ సినిమాని చిత్రికరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -