ప్రముఖ గుండె వైద్య నిపుణులు రొటేరియన్ డాక్టర్ సందీప్ రావు
నవతెలంగాణ – కంఠేశ్వర్
గుండె ఆరోగ్యాకరంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానం అవసరమని ప్రముఖ గుండె వైద్య నిపుణులు రొటేరియన్ డాక్టర్ సందీప్ రావు అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక సత్యా ఒకేషనల్ జూనియర్ కాలేజీలో నేడు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజాంబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు రొటీరియన్ డాక్టర్ సందీప్ రావు హాజరై మాట్లాడుతూ..గుండె ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానం అవసరమని తెలియజేస్తూ ముఖ్యంగా హార్ట్ ఎటాక్ గుండెపోటు రావడానికి కారణం అధిక మానసిక ఒత్తిడి, నిద్రలేమి, శారీరక శ్రమ లేకపోవడం , ఎక్కువగా నూనె పదార్థాలు తినడం, బయట ఆహార పదార్థాలు తినడం, ధూమపానం, డ్రగ్స్, మత్తు, మద్యం సేవించడం వల్ల గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు.
మనిషికి కనీసం ఎనిమిది గంటలు నిద్ర అవసరమని, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలని, శరీరానికి తగిన వ్యాయామం అవసరమని తెలియజేేశారు. పౌష్టికమైన మితమైన ఆహారంతో పాటు ప్రతి ఆరు నెలలకోసారి మధుమేహ పరీక్ష, రక్తపోటు పరీక్ష, కొలెస్ట్రాల్ పరీక్ష, శరీర బరువు పరీక్ష గుండె కొరకు 2డి ఎకో , తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ఒకవేళ అనుకోకుండా ఛాతిలో నొప్పి వస్తే శరీరానికి చెమటలు వస్తుంటే వెంటనే గుండె వ్యాధి నిపుణులను సంప్రదించాలని తెలియజేశారని క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులతో పాటు క్లబ్ సెక్రటరీ గంజి రమేష్ సభ్యులు చంద్రశేఖర్, గిరీష్ కుమార్, గౌరీ శంకర్, లెక్చరర్స్ పాల్గొన్నారు.
గుండె భద్రతకు ఆరోగ్యకరమైన జీవన విధానం అవసరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES