Monday, July 7, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అంబులెన్స్ లో ప్రసవించిన నిండు గర్భిణి...

అంబులెన్స్ లో ప్రసవించిన నిండు గర్భిణి…

- Advertisement -

 నవతెలంగాణ – జన్నారం
కడెం మండలం ఉడుంపూర్కు చెందిన నిండు గర్భిణి టేకం ముత్తుబాయి ఆదివారం అంబులెన్స్ లో ప్రసవించారు. ముత్తుబాయికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జన్నారం 108 సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది ఆమెను 108 వాహనంలో  ఉట్నూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని టెక్నీషియన్ మునీందర్ గౌడ్, పైలట్ రఫిక్ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -