Friday, July 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవిన్యాసాల్లో అపశృతి..న‌దిలో కూలిన హెలికాప్ట‌ర్

విన్యాసాల్లో అపశృతి..న‌దిలో కూలిన హెలికాప్ట‌ర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మలేషియాలో అణు భద్రతా విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. విన్యాసాలు చేస్తుండగా జోహోర్ నదిలో మలేషియా పోలీస్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అధికారులు గాయపడ్డారు. మెరైన్ పోలీసులు వెంటనే అప్రమత్తమై అధికారులను రక్షించారు. హుటాహుటినా సుల్తానా అమీనా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మలేషియాతో కలిసి సింగపూర్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్ ‘మిత్సతోమ్‌ 2025’ పేరుతో బహుళజాతి అణు భద్రతా విన్యాసాలు చేస్తున్నాయి. ఆయా దేశాలకు చెందిన పలు బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. మలేషియాకు చెందిన ఎయిర్‌బస్ AS355N టాంజంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి గంట‌లోపే మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ (MMEA) జెట్టీకి కేవలం 21 మీటర్ల దూరంలో కూలిపోయింది. వెంటనే మెరైన్ పోలీసులు నీటిలోంచి బయటకు తీసి జోహోర్ బహ్రులోని సుల్తానా అమీనా ఆస్పత్రికి తరలించారు. మాక్ డ్రిల్‌ను కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదం చాలా షాకింగ్‌గా ఉందని ఎడ్జ్ మలేషియా పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -