ఎన్ట్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’. ఈ సినిమా కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేతులు కలిపింది. అంతేకాదు ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’, ‘దేవర’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘వార్ 2’ కోసం కలిసి పని చేయటం విశేషం.
వైఆర్‌ఎఫ్ బ్లాక్ బస్టర్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేయటానికి సిద్ధమైంది. ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ హక్కులను సితార ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసింది.
ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా తెలియజేస్తూ ట్వీట్ చేసింది. ‘హ్యాట్రిక్ హిట్ కోసం సరికొత్త ఎనర్జీ, ప్యాషన్‌తో..మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హతిక్, పవర్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ కాంబోలో రానున్న ‘వార్2’తో ఓ ఎక్స్‌ప్లోజివ్ రైడ్‌ను ప్రారంభిస్తున్నాం. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది. ఆగస్ట్ 14న థియేటర్స్‌లో ఈ ఉత్సవం మొదలు కానుంది’ అని ట్వీట్‌లో తెలిపింది.
భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్2’ యష్ రాజ్ ఫిల్మ్స్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా మరో అధ్యాయంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్, టైగర్ 3, వార్’ వంటి గ్లోబల్ హిట్ మూవీస్ తర్వాత వస్తోన్న దీనిపై పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ లెవల్లో లీజ్ చేస్తుండటం ప్రేక్షకులకు పండగే. ఈ మూవీలో ఇండియన్ సినీ హిస్టరీలో ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన హతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉండే పోటీ ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. ‘బ్రహ్మాస్త్ర, యేV్‌ా జవానీ హై దీవానీ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది అని మేకర్స్ తెలిపారు.
భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్
- Advertisement -
- Advertisement -