Saturday, March 7, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర సాయంలో భారీ కోత

కేంద్ర సాయంలో భారీ కోత

- Advertisement -

కూటమి ప్రభుత్వంలోనూ తప్పని నిరాశ
2024-25లో రూ.15 వేల కోట్ల తగ్గుదల
కాగ్‌ నివేదికలో వెల్లడి
అమరావతి :
ప్రతియేటా కేంద్రం ఇచ్చే నిధులపై ఆశలు పెరచుకోవడం, చివరకు భారీ కోతలతో నిరాశ చెందడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఇదే పరిస్తితి కొనసాగుతోంది. 2024-25 సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రాష్ట్ర శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టిన నివేదికలో సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఆ ఏడాది 20,188 కోట్ల రూపాయలు కేంద్రం నుండి వచ్చినట్లు కాగ్‌ తేల్చింది. అది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే రు. 15వేల కోట్ల రూపాయల తక్కువకావడం గమనార్హం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రు. 31,872 కోట్లు కేంద్రం నురచి గ్రారట్లుగా వచ్చాయి. ఆ తరువాత సంవత్సరం ఈ నిధులు పెరిగి రు. 39,170 కోట్లకు చేరుకున్నాయి ఆ తరువాత నుండి ప్రతి ఏటా నిధుల రాక తగ్గుతూనే వస్తోరది. 2022-23లో రు. 36 వేల కోట్లు, 2023- 24లో రు.34,702 కోట్లు రాగా, 2024-25 సంవత్స రానికి రు. 20 వేలకు పడిపోయిరది. ఈ మొత్తంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రు. 14,807 కోట్లు రాగా, ఆర్థిక సంఘం నిధుల ద్వారా రు.4,739 కోట్లు, ఇతర గ్రారట్లు ద్వారా రు. 642 కోట్లు వచ్చినట్లు కాగ్‌ వెల్లడిరచిరది. అత్యధికంగా పోలవరం ప్రాజెక్టుకు రు. 5,512 కోట్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆ తరువాత ఉపాథి హామీ పథకానికి రు. 1,673 కోట్లు, ఆరోగ్య మిషన్‌కు రు. 1,319 కోట్లు, సమగ్ర శిక్ష పథకానికి రు.1,240 కోట్లు వచ్చాయి.
కేరద్రం నురచి వచ్చిన నిధులు (రూ. కోట్లలో)
సంవత్సరం మొత్తం
2020-21 31,872
2021-22 39,170
2022-23 36,148
2023-24 34,702
2024-25 20,188

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -