Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట

కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్: సీనియ‌ర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలంటూ శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సాక్షి చానెల్‌ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ అక్రమమంటూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిన్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్‌ చేస్తారా?. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఏం సంబంధం?. ఆయన్ని వెంటనే విడుదల చేయండి. డిబేట్లను గౌరవ ప్రదంగా నిర్వహించాలి. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్‌ కోర్టు విధిస్తుంది’’ అని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad