Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్భార్యను కత్తితో పొడిచి హత్య చేయాలని ప్రయత్నిoచిన భర్త..

భార్యను కత్తితో పొడిచి హత్య చేయాలని ప్రయత్నిoచిన భర్త..

- Advertisement -

– నిందితునికి ఐదు సంవత్సరాల జైలు  శిక్ష 
– ఐదువేలు రూపాయల జరిమానా  
– నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ  యం.రాజేష్ చంద్ర,
నవతెలంగాణ – కామారెడ్డి 

భార్యను కత్తితో పొడిచి హత్య చేయాలని ప్రయత్నిoచిన భర్త నిందితునికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఐదువేలు రూపాయల జరిమానా విధించడం జరిగిందని, నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను అభినందించినట్లు జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, ఒక పట్టణంలో తెలిపారు. తేది  26/02/2022 నా కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం మర్రకుంట తండా కు చెందిన  బాదావత్ తేజానాయక్, తన కూతురు బాదావత్ స్వాతిని మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన విస్లావత్ లచ్చిరాం  కు ఇచ్చి 12  సం.ల  క్రితం  వివాహం చేయడం జరిగింది.  వారికి ఒక కూతురు కలదు.  ఫిర్యాది అల్లుడు లచ్చిరాం తాగుడుకు బానిసై తన కూతురు స్వాతిని అదనపు కట్నం కోసం మానసికంగా  శారీరకంగా వేదించినాడు.  కులంలో ఎన్నో సార్లు పంచాయితీ పెట్టి మాట్లాడిన అల్లుడు లచ్చిరాం వినక పోవదముతో  కూతురు స్వాతిని మాచారెడ్డి నుండి వారి ఇంటికి మర్లకుంట తండా కి తెచ్చుకున్నాడు. అక్కడ ఉంటుండగా తేదీ 26/02/2022 నా గాంధారి గ్రామానికి టైలరింగ్ నిమిత్తం వెళ్ళింది. మధ్యాహ్నం 3:30 గంటల సమయములో  అల్లుడు  విస్లావత్ లచ్చిరాం ఒక వాహణముపై  గాంధారి వచ్చి బైక్ లో ఉన్న కత్తిని తీసి నా కూతురు పై దాడి చేయగా నా కూతురు ఎడమ చేతికి, చెంపపై రక్తపు  గాయాలు అయినవని ఫోన్ ద్వారా తెలువగా వెంటనే గాంధారి కి వెళ్ళి కూతురు స్వాతి రక్తపు గాయాలతో ఉన్నది. వెంటనే ఆమెను  చికిత్స కోసం హాస్పిటల్ తీసుకెళ్లి తదుపరి గాందారి పోలీస్ స్టేషన్ కు  వెళ్లి తన  కూతురును  చంపాలనే ఉద్దేశం తో   అల్లుడు విస్లావత్ లచ్చిరాం కత్తితో  పొడవుగా రక్తపు గాయాలైనవని పిర్యాదు చేసినాడు. ఈ విషయములో నేరస్తుడిని అరెస్ట్ చేసి కోర్టు లో అభియోగ పత్రం వేయడం జరిగింది. కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని  గౌరవ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు కామారెడ్డి    న్యాయమూర్తి డా. యస్. సుమలత  నిoదితునికి  5 సంవత్సరాల జైలు  శిక్ష తోపాటు  5 వేల రూపాయల జరిమానా  విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగినది.  పోలీస్ తరఫున వాదన వినిపించిన పిపి దామోదర్ రెడ్డి,    ఈ కేసును  సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి గాంధారి ఎస్సై సాయిరెడ్డి,  ప్రస్తుత ఎస్సై ఆంజనేయులు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై  రామేశ్వర్ రెడ్డి,   సీడీవో యస్.  రమేష్ లను అభినందించడం జరిగిందని ఎస్పీ ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -