Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeకవితజ్ఞాపకాల సెలయేరు

జ్ఞాపకాల సెలయేరు

- Advertisement -

గెలవకతప్పని బతుకాటలో
ఓటమినై.. మలుపునై..సమరాన్నై.. సంసారాన్నై..
ఒక్కడినై.. అందరివాడినై.. ఒంటరినై.. ఆపద్బాంధవుడనై..
”నా జ్ఞాపకాల సెలయేరును
జ్ఞానోదయ సంద్రంగా మార్చుకున్నా..!”
పరివర్తనం చెందుతూ ప్రాణనిలయంలో నిలుపుకున్నా..!
అమ్మ తపనని ఏ తపస్సు సాక్షాత్కారించగలదు..?
నాన్న ధైర్యాన్ని ఏ దైవ దండకం ఓడించగలదు..?
నాన్నమ్మ త్యాగాన్ని ఏ వేదాంతం వివరించగలదు..?
భార్య ప్రేమను ఏ శాస్త్రం కొలవగలదు..?
తమ్ముళ్ళ అంతరంగాన్ని ఏ అంతరిక్షం పరిశోధించగలదు..?
అనుక్షణం అప్రమత్తమై నాలో నన్నే ఉద్వేగపరుస్తున్నా
ఇలాంటి ఎన్నో వెంటాడుతున్నా
జ్ఞాపకాల వేటలో, ఎదురీతల వెలుగులో
ఫిజిక్స్‌ అరుణకిరణమై, అభ్యుదయ వాదమై
విశ్వమానవతా శిఖరమై
శ్రీ శ్రీ పాదాల వద్ద పుష్పమై నే కదులుతున్నా..
జ్ఞాపకాల తరంగాలతో కలిసే వెళ్తున్నా!!
– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad