Friday, May 9, 2025
Homeజాతీయంఅతిథి కార్మికులకు ఆశా'జ్యోతి'

అతిథి కార్మికులకు ఆశా’జ్యోతి’

- Advertisement -

– వలస కార్మికుల పిల్లల చదువుల కోసం
– ప్రత్యేక పథకం ప్రారంభించిన కేరళ
– కేరళలో పురోభివృద్ధిలో అతిథి కార్మికుల సేవలు
– ఎనలేనివని ముఖ్యమంత్రి విజయన్‌ ప్రశంసలు
తిరువనంతపురం:
అతిథి కార్మికులు కేరళలో అంతర్భాగం. వీరి పిల్లల కోసం కేరళ ప్రభుత్వం తాజాగా ‘జ్యోతి’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం కేరళలో వివిధ రంగాల్లో 35 లక్షల మంది అతిధి కార్మికులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కుటుంబాలతో జీవిస్తున్నారు. కాబట్టి ఈ చిన్నారుల కోసం కేరళ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అతిథి కార్మికుల చిన్నారులకు విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యతగా కేరళ భావిస్తుంది. ఇప్పటికే అందరికీ తప్పనిసరి, ఉచిత విద్య లక్ష్యాన్ని సాధించిన కేరళ అతిథి కార్మికుల చిన్నారుల విద్యా బాధ్యతను నిర్వర్తించడానికి ఉపక్రమించింది. ఇందులో భాగంగానే కేరళ ప్రభుత్వం రూపొందించిన కొత్త పథకం ‘జ్యోతి’ను బుధవారం ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు మూడు నుంచి ఆరేళ్ల వయస్సు గల అతిథి కార్మికుల పిల్లలందర్నీ అంగన్‌వాడీలకు తీసుకురావడం, ఆరు ఏళ్ల వయస్సు పూర్తి చేసిన వారిని పాఠశాలలకు తీసుకురావడం. అలాగే సాంస్కృతిక-విద్యా సమన్వయాన్ని నెలకొల్పడం. ఈ పథకం సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడుతూ కేరళ పురోభివృద్ధిలో అతిథి కార్మికుల సేవలు ఎనలేనివని ప్రశంసించారు. కేరళ అభివృద్ధికి తమ శ్రమ ద్వారా శక్తినిచ్చే అతిథి కార్మికుల సంక్షేమం, అభ్యున్నతినికి ఈ పథకం సహయపడుతుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -