Thursday, December 25, 2025
E-PAPER
Homeక్రైమ్కాలి బుడిదైన బస్సు...

కాలి బుడిదైన బస్సు…

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: క్రిస్మస్ పండుగ పూట కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకరు కాదు … ఇద్దరు కాదు… 20మంది వరకు అగ్నికి ఆహుతయ్యారు. ప్రయివేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 20 మంది సజీవదహనమయ్యారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. హిరియూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న లారీ.. అదుపుతప్పి రోడ్డుకు అటుపక్క వెళ్తున్న ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటలు బస్సును పూర్తిగా కమ్మేశాయి. బస్సు నుంచి బయటపడి వీలు లేకపోవడంతో దాదాపు 20మంది సజీవదహనం అయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా.. ప్రమాద సమయంలో బస్సులో 32మంది ఉన్నట్టు సమాచారం. కాగా ‌లారీలో ఎంత మంది ఉన్నారో తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -