Friday, September 12, 2025
E-PAPER
Homeజాతీయంస్పైస్‌జట్ విమానానికి త‌ప్పిన పెనుముప్పు

స్పైస్‌జట్ విమానానికి త‌ప్పిన పెనుముప్పు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జట్ విమానానికి కూడా పెనుముప్పు తప్పింది. కాండ్లా ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఆ విమానం బయటివైపు చక్రం ఊడిపోయి రన్‌వేపై కనిపించింది. దాంతో పైలట్‌ను అప్రమత్తం చేసి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమనాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. శుక్రవారం మధ్యాహ్నం 15.51 గంటలకు విమానం సురక్షితంగా ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది. ఈ విషయాన్ని స్పైస్‌జట్ అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -