- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి: గడ్డి మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామారెడ్డిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డి గ్రామానికి చెందిన కే లింబాద్రి ( 43) కుటుంబం సమస్యలతో సోమవారం గడ్డి మందు తాగాడాని, వెంటనే గమనించిన కుటుంబసభ్యులు బాధితుని చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
- Advertisement -



