Saturday, February 14, 2026
E-PAPER
Homeఆటలుఆఫ్ఘనిస్థాన్ టీం స‌భ్యుడికి గుండెపోటు

ఆఫ్ఘనిస్థాన్ టీం స‌భ్యుడికి గుండెపోటు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆఫ్ఘనిస్థాన్ ఆ టీంలోని ఒక సభ్యుడికి గుండెపోటు వ‌చ్చింది. ఆ జ‌ట్టు పర్ఫామెన్స్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న కేసీ రామ సుబ్రమణియన్, హోటల్‌లో ఉన్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. అక్కడ జట్టు మెడికల్ టీం మొదట అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతడిని టీం సభ్యులు దక్షిణ ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని, అయినప్పటికీ ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచారని వెల్లడించారు. రామ సుబ్రమణియన్ అనారోగ్యం పాలవడంతో ఆఫ్ఘనిస్తాన్ టీం సభ్యుల్లో కెప్టెన్ రషీద్ ఖాన్, సీనియర్ ఆటగాడు మొహమ్మద్ నబీ వంటి ఆటగాళ్లు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం గ్రూప్-డిలో రెండు పాయింట్ల‌తో నాల్గో స్థానంలో ఉన్న‌ ఆఫ్ఘనిస్థాన్.. ఆడినా రెండు మ్యాచ్‌లోను ఓట‌మి చ‌విచూసింది. ద‌క్షిణాఫ్రికాపై రెండు సూప‌ర్ ఓవ‌ర్లో వీరోచితంగా పోరాడి ప‌రాజ‌యం పొందింది. మొద‌టి సూప‌ర్ టై కాగా, రెండో సూప‌ర్ ఓవ‌ర్లో ర‌షీద్ ఖాన్ సేన ఓడిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -