నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందించాలనే ధ్యేయంతో టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పనిచేస్తున్నారని టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ తెలిపారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ అధ్యక్షులు అయ్యిన తరువాత ప్రతి రోజు ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు వివిధ సంస్థల కార్పొరేషన్ ల ఛైర్మెన్లు, తెలుసుకొని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి ప్రజల సమస్యల పరిష్కారం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందన్నారు.
రాష్ట్ర ప్రజలు గాంధీ భవన్ కు వెలితే మాకు న్యాయం, జరుగుతుంది, మా సమస్యలు పరిష్కారం జరుగుతుందనే విధంగా గాంధీభవన్ ఒక వేదిక అయింది అన్నారు. ప్రజా ప్రతినిధులను సమస్యలు వెంటనే పరిష్కరించాలానే కార్యాచరణతో రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రజలకు సంక్షేమం ఫలాలు అందించడం లో సక్సెస్ అయ్యారని అబ్దుల్ అహ్మద్ అన్నారు. ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గం వైపు ప్రత్యేక దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వీరి వెంట బాన్సువాడ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు తదితరులున్నారు.