Monday, March 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'మండలి'కి కొత్త శోభ

‘మండలి’కి కొత్త శోభ

- Advertisement -

నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కొత్త సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాష్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గడ్డం వివేక్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, రాజ్యసభ సభ్యులు వేంనరేందర్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాసనమండలిలోని తన ఛాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా పూజచేశారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. అనంతరం అక్కడి నుంచి మహిళా జర్నలిస్టులతో ఉమెన్స్‌ డేలో పాల్గొనేందుకు ప్రజాభవన్‌కు వెళ్లిపోయారు.

1905లో నిర్మితమైన ఈ టౌన్‌ హాల్‌ భవనం రాజస్తాన్‌, పర్షియన్‌ శైలిలో సుందరంగా నిర్మించారు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ భవనం అప్పట్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, శాసనమండలి ఒకే ప్రాంగణంలో కొనసాగేవి. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రెండు వేర్వేరు భవనాల్లో కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శాసన కార్యకలాపాలు ఒకే ప్రాంతంలో ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చారిత్రక వారసత్వాన్ని కాపాడే దిశగా చర్యలు చేపట్టారు. హెరిటేజ్‌ విలువ కలిగిన ఈ భవనాన్ని పరిరక్షిస్తూ ఆధునిక సౌకర్యాలతో ఆగాఖాన్‌ కల్చరల్‌ సర్వీసెస్‌ ఫోరం, రోడ్లు, భవనాల శాఖలు సంయుక్తంగా పునరుద్ధరణ పనులు చేపట్టాయి. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో శాసనమండలి భవనం అభివద్ధి పనులు పూర్తయ్యాయని అధికార వర్గాల సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -