Saturday, June 7, 2025
E-PAPER
Homeసినిమాక్రేజీ కాంబినేషన్‌లో నయా సినిమా

క్రేజీ కాంబినేషన్‌లో నయా సినిమా

- Advertisement -

హీరో రవితేజ, దర్శకుడు కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రం గురువారం ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభమైంది.
రవితేజ సిగేచర్‌ స్టయిల్‌, కామెడీతో కూడిన కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర ్‌టైనర్‌ని దర్శకుడు కిషోర్‌ తిరుమల రాశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ కథలో రవితేజ తనదైన ఎనర్జీతో అలరించనున్నారు.
అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో రవితేజ వెరీ స్టైలిష్‌ అవతార్‌లో, డిజైనర్‌ సూట్‌ ధరించి కనిపిస్తున్నారు. అతను పట్టుకున్న పుస్తకంలో ‘సీ ఇట్‌ అండ్‌ సే ఇట్‌’ స్పానిష్‌లో ఉంది. ఇది ఆయన పాత్రపై ఆసక్తిని పెంచుతోంది.
‘ధమాకా’ కోసం చార్ట్‌బస్టర్‌ ఆల్బమ్‌ను అందించిన తర్వాత భీమ్స్‌ ఈ చిత్రానికి రవితేజతో మళ్ళీ వర్క్‌ చేస్తున్నారు. ప్రసాద్‌ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు. ఎడిటర్‌గా శ్రీకర్‌ ప్రసాద్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఏ.ఎస్‌.ప్రకాష్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయబోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -