Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంమూగ జీవాల ప్రాణాలుహరించే పరాన్నజీవి

మూగ జీవాల ప్రాణాలుహరించే పరాన్నజీవి

- Advertisement -

– అమెరికాలో గుర్తించిన అధికారులు
వాషింగ్టన్‌ :
‘న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌’ అనే మాంసాహార పరాన్నజీవి (ఈగ వంటిది) కారణంగా అమెరికాలో మొట్టమొదటి వైరస్‌ కేసు నమోదైంది. అమెరికా ఆరోగ్య-మానవ సేవల విభాగం (హెచ్‌హెచ్‌యస్‌) ఈ విషయాన్ని తెలియజేసింది. ఇది మరో దేశం నుంచి ప్రయాణికుల ద్వారా అమెరికాలో ప్రవేశించిందని చెప్పింది. మేరీల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌, యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ఈ కేసును పరిశీలించాయి. పరాన్నజీవిని న్యూ వరల్డ్‌ స్క్రూవార్మ్‌గా నిర్ధారించాయి. ఎల్‌ సాల్వెడార్‌ వెళ్లి తిరిగి అమెరికాకు వచ్చిన ఓ రోగికి ఈ వ్యాధి సోకింది. కాగా గ్వాటెమాలా నుంచి అమెరికాలోని మేరీల్యాండ్‌కు వచ్చిన వ్యక్తిలో ఈ కేసు కన్పించిందని సీడీసీ నిర్ధారించినట్లు బీఫ్‌ పరిశ్రమ వర్గాలు తెలిపాయని రాయిటర్స్‌ వార్తా సంస్థ చెప్పింది.
అయితే ఈ పరాన్నజీవి వైరస్‌ కారణంగా అమెరికా ప్రజల ఆరోగ్యానికి జరిగే హాని చాలా తక్కువేనని హెచ్‌హెచ్‌యస్‌ ప్రతినిధి ఆండ్రూ జి. నిక్సన్‌ తెలిపారు. ఇది ఎక్కువగా మూగ జీవాలకే ప్రాణహాని కలిగిస్తుంది. కాగా ఈ కేసుపై అమరికా ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పరాన్నజీవి మధ్య అమెరికా, దక్షిణ మెక్సికో నుంచి ఉత్తరం వైపుకు కదలడంతో అమెరికాలో దాని ప్రభావంపై పశువుల పెంపకందారులు, మాంసం ఉత్పత్తిదారులు, పశు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో పశువులను అత్యధికంగా ఉత్పత్తి చేసే టెక్సాస్‌ రాష్ట్రంలో పరాన్నజీవి వైరస్‌ వ్యాప్తి చెందితే ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని, పశువులు మరణిస్తాయని, వైద్య ఖర్చులు పెరుగుతాయని, మొత్తంమీద 1.8 బిలియన్‌ డాలర్ల వ్యయం అవుతుందని యూఎస్‌డీఏ అంచనా వేసింది.
పశువులు, మాంసం రంగాలకు చెందిన వారికి వైరస్‌ వ్యాప్తిపై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పరాన్నజీవి పశువుల మందల ప్రాణాలను మూకుమ్మడిగా హరించగలదు. వన్య ప్రాణులు, పెంపుడు కుక్కలను కూడా చంపగలదు. 1980, 1990 దశకాలలో మధ్య అమెరికాలో ఈ పరాన్నజీవి ఉనికి ఎక్కువగా కన్పించింది. భారీ వ్యయంతో దానిని నిర్మూలించగలిగారు. కానీ గడచిన రెండు సంవత్సరాల కాలంలో ఇది మళ్లీ కన్పిస్తోంది. అమెరికా వ్యవసాయ శాఖ మంత్రి బ్రూక్‌ ఎల్‌. రోలిన్స్‌ ఇటీవలే టెక్సాస్‌లో పర్యటించి ఈ పరాన్నజీవి నిర్మూలనకు ఐదంచెల ప్రాణాళికను ప్రకటించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad