- వ్యవసాయ శాఖ జిల్లా అధికారికి వినతి
నవతెలంగాణ-నెల్లికుదురు: నెల్లికుదురు మండలంలోని నైనాల క్లస్టర్‌కు శాశ్వత ఏఈఓను నియమించాలని ఆ గ్రామ రైతులు యాసం రమేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్‌లోని జిల్లా కార్యాలయంలో వ్యవసాయ అధికారి మురళికి వినతి పత్రాన్ని అందించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. నైనాల క్లస్టర్ గ్రామాలకు ఏఈఓ లేకపోవడంతో.. క్లస్టర్ పరిధిలోని రైతులు పంటల నమోదులో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని తెలిపారు.
కురిసిన వర్షాలకు పంట నష్ట పోయిన రైతుల సర్వే రేపటితో ముగస్తుందని అన్నారు. ఇప్పటివరకు క్లస్టర్ పరిధిలో సర్వే ఏ అధికారి కూడా సర్వే మొదలు నిర్వహించలేదని, పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శాశ్వత పద్దతిలో ఏఈఓను నియమించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నైనాల మాజీ ఎస్ఎంఎస్ చైర్మన్ ఆవుల సాయిమల్లు పాల్గొన్నారు



