పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి ప్రభంజనం..
నవతెలంగాణ – జన్నారం
పాలగోరి గూడెం ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యే బెడమా బొజ్జో పటేల్ కు పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి ప్రభంజనం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. కవ్వాల్ అభయారణ్యంలోని పాలగోరి గూడెం ప్రజలకు 112 సర్వే నెంబర్ లో హక్కు పత్రాలు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు వారి గుడిసెలను తొలగించారు. కాబట్టి ఆ గ్రామ ప్రజలకు హద్దులు గీసి పక్క ఇల్లు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే చొరవ చూపించాలని కోరారు. ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు. అనంతరం ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జుపటేల్ మాట్లాడుతూ .. త్వరలో పై అధికారులతో మాట్లాడి పాలగోరీల గూడానికి సంబంధించిన ఆదివాసీల కాలనీ నిర్మాణానికై చర్చించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జన్నారం మండల నాయకులు పాల్గొన్నారు.
పాలగోరి గూడెం ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES