నవతెలంగాణ-హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ప్రాంతంలో రాత్రికి రాత్రి ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. నిరాశ్రయులైన కుటుంబాల దీనస్థితిని చూసి ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం , స్థానిక నాయకుల తీరుపై ఆమె నిప్పులు చెరిగారు. చిన్న పిల్లలు, విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయనే కనీస మానవత్వం లేకుండా బుల్డోజర్లతో ఇళ్లను నేలమట్టం చేశారని కవిత మండిపడ్డారు. రాత్రికి రాత్రి వచ్చిన బుల్డోజర్లు పేదవాడి సొంతింటి కలను ఛిన్నాభిన్నం చేశాయని, విద్యార్థుల పుస్తకాలతో సహా సామాన్లన్నీ మట్టిలో కలిసిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో ఆడబిడ్డలు, చిన్న పిల్లలు రోడ్డున పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన కవిత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



