Sunday, May 11, 2025
Homeసినిమాకలెక్షన్స్‌లో కొంత భాగం భారత సైనికులకు విరాళం

కలెక్షన్స్‌లో కొంత భాగం భారత సైనికులకు విరాళం

- Advertisement -

శ్రీ విష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించిన చిత్రం ‘సింగిల్‌’. వెన్నెల కిషోర్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మించారు. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్‌ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుని, సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.
ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ,’భారత్‌ మాతాకీ జై. మేము ఒక మిక్స్డ్‌ ఫీలింగ్‌తో ఇక్కడికి వచ్చాం. సినిమా రిలీజ్‌ సందర్భంగా ఉత్సాహంగా రావాలని అనుకున్నాం. కానీ మన సైనికులు మన దేశం కోసం పోరాడుతుంటే.. సినిమా విషయంలో మేం సెలబ్రేషన్స్‌ చేసుకోవడం సరికాదు అనిపించింది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కతజ్ఞతలు తెలిపేందుకే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టాం. మన దేశం కోసం పోరాడుతున్న సైనికులకి ఇక్కడ నుంచి సపోర్టే కాకుండా ఈ సినిమా నుంచి వచ్చే కలెక్షన్స్‌లో కొంత భాగం అందజేయనున్నాం. ఈ ఉద్రిక్త పరిస్థితులకు ముందు మేం ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించాం. వాయిదా వేయడం మంచిదా, కాదా అన్న దానిపై చర్చించాం. సినిమా కోసం వందల మంది పనిచేయడమే కాదు థియేటర్లపై వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎవరూ తప్పుగా అర్థంచేసుకోరనే ధైర్యంతో సినిమాని విడుదల చేశాం. సినిమా విషయానికి వస్తే, మొదటి నుంచి ఒక ఆహ్లాదకరమైన సినిమాని ఇవ్వాలని ప్రయత్నించాం. థియేటర్లలో రియాక్షన్‌ చూసిన తర్వాత మేము అనుకున్న దాని కంటే అద్భుతంగా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులు అందరికీ మా కతజ్ఞతలు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్‌ అద్భుతంగా అలరించారు. శ్రీ విష్ణు తన అన్ని సినిమాల కంటే ఒక మెట్టు ఎదిగి సిక్సర్‌ కొట్టాడు. వెన్నెల కిషోర్‌ ఫుల్‌ కిక్‌ ఇచ్చారు. భాను, నందు చాలా చక్కని డైలాగ్స్‌ రాశారు. డైరెక్టర్‌ చాలా ఎంటర్టైనింగ్‌గా సినిమా తీశారు. ఇద్దరు హీరోయిన్స్‌ కూడా చాలా చక్కగా పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. గీతా ఆర్ట్స్‌ నుంచి గత ఆరు నెలల్లో మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి. మాకు హ్యాట్రిక్‌ సక్సెస్‌ ఇచ్చిన ప్రేక్షకులకు పేరుపేరునా ధన్యవాదాలు’ అని అన్నారు.
‘మార్నింగ్‌ నుంచి ప్రతి ఏరియా నుంచి చాలా అద్భుతమైన కాల్స్‌ వస్తున్నాయి. థియేటర్‌లో పగలబడి నవ్వుతున్నామని ఆడియన్స్‌ చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందర్నీ నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం. ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కి రండి. మిమ్మల్ని నవ్వించే బాధ్యత మాది’ అని హీరో శ్రీ విష్ణు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -