– పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించే అవకాశం
నవతెలంగాణ-ముప్కాల్ : ఈ నెల డిసెంబర్ 25న అటల్ బిహారి వాజ్ పేయ్, పండిత్ మదన్ మోహన్ మాల్వ్య జయంతిని పురస్కరించుకొని భారత పార్లమెంటులో పార్లమెంటరీ రిసర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ (ప్రైడ్) భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల శాఖ సంయుక్తంగా ‘నో యువర్ లీడర్’ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంపికైన యువత పార్లమెంట్ భవన సముదాయంలో జరిగే జాతీయ నాయకుల జన్మదిన వేడుకల్లో జరిగే అవకాశాన్ని పొందుతారని మండల విద్యాధికారి జె.రవి కుమార్ సోమవారం రోజు తెలిపారు. ఈ పోటీలకు గత నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పట్టణ కేంద్రంలో జరిగిన జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 36 పాఠశాలలను ఎన్సీఈఆర్టీ ద్వారా ఎంపిక చేసారని పేర్కొన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన నాలుగు పాఠశాలల్లో మన మండలం నుంచి రెంజర్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఒకటని అన్నారు. విద్యార్థి కే.అంకిత, గైడ్ టీచర్ సుద్ధపల్లి మల్లేష్ లు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తమ సైన్స్ ప్రాజెక్ట్, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ గురించి నాలుగు నిమిషాలు ప్రసంగించే అవకాశాన్ని పొందినట్లు ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రెంజర్ల పాఠశాలకు రావడం పట్ల జిల్లా విద్యాధికారి అశోక్, డీఎస్వో గంగా కిషన్, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని అంకితను గైడ్ టీచర్ సుద్ధపల్లి మల్లేష్ ను అభినందించారు..
రెంజర్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్ధినికి దక్కిన అరుదైన గౌరవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



