నవతెలంగాణ-హైదరాబాద్: సినీ రంగంలో అత్యున్నత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును మలయాళ(Malayalam) ప్రముఖ నటుడు మోహన్ లాల్‌కు దక్కింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డును అనౌన్స్ చేసింది. ఈనెల 23వ తేదీన మోహన్ లాల్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు.
కాగా, మోహన్ లాల్ ఇప్పటికే పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీ అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాలు స్వీకరించారు. ‘భరతమ్’ ‘వానప్రస్థం’ సినిమాలకు గాను రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పురస్కారాన్ని దక్కించుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా అన్ని భాషల సినిమాల్లో మోహన్ లాల్ నటించారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో విశేష ప్రతిభచూపిన మోహన్‌లాల్‌ను తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.