– వరల్డ్ టాప్ 2 % శాస్త్రవేత్తల లిస్టులో చోటు
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రా యూనివర్సిటీ భూగర్భ శాస్త్ర మాజీ విభాగాధిపతి నందిసుబ్బారావుకు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ యూనివర్సిటీ ఎల్సివియర్ సంయుక్తంగా రిలీజ్ చేసిన ప్రపంచంలోని టాప్ 2 % శాస్త్రవేత్తల జాబితా-2025లో ఆచార్య నందిపాటి సుబ్బారావుకు చోటు లభించింది.
ఇటీవలే ఈ జాబితా విడుదల కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్ష మంది శాస్త్రవేత్తల్లో సుబ్బారావుకు 3105వ ర్యాంకు దక్కించుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో చేసిన అత్యంత ప్రభావవంతమైన పరిశోధనలకుగాను ఈ ర్యాంకులు కేటాయిస్తారు.
ఆచార్య సుబ్బారావు 2020 నుంచి 2025 వరకు వరుసగా ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం. ఆయన వెలువరించిన 135 పరిశోధన పత్రాలు ప్రతిష్టాత్మక జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వాటిలో 73 జాతీయ, 62 అంతర్జాతీయ జర్నల్స్ ఉన్నాయి.