నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ రాత్రి అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. గ్రహణం సమయంలో చంద్రడు గాఢ ఎరువు రంగు(బ్లడ్ మూన్) కనువిందు చేయనున్నాడు. భారత్ కాలమాన ప్రకారం గ్రహణం ఆదివారం రాత్రి 8.58 గంటలకు ప్రారంభం అవుతుంది. సంపూర్థ చంద్రగ్రహణం 11 గంటల నుంచి 12.22 వరకు ఉంటుంది. రాత్రి 2.25 గంటలకు గ్రహణం వీడిపోతుంది. సూర్యుడికి, చంద్రునికి సరిగ్గా మధ్యలోకి భూమి రావడం, చంద్రుడిపై పడే సూర్య కిరణాలు భూ వాతావరణంలోనే పరిక్షేపణం చెందడం, భూమి కొసల నుంచి ఎరుపు రంగు కాంతి చంద్రుడిపై పడటంతో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు. వాతావరణం అనుకూలంగా ఉంటే ప్రపంచంలో 85శాతం మంది ఈ గ్రహణాన్ని వీక్షించగలరని నిపుణులు అంటున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో స్పష్టంగా వీక్షించవచ్చు.
ఇవాళ రాత్రి అరుదైన చంద్రగ్రహణం
- Advertisement -
- Advertisement -