నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇవా ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిల్వ ఉంచిన వేస్ట్ కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇక మరోవైపు గంపల బస్తీలోని స్క్రాప్ గౌడన్లో కూడా మంటలు చేలరేగాయి, దట్టమైన నల్లటి పొగను చూసి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ రెండు ప్రమాదాల గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్ ఇంజన్లతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెమికల్, స్క్రాప్ గోడౌన్లు కావడంతో మంటలను అదుపు చేయడం సవాలుగా మారింది. ఈ ప్రమాదాలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
జీడిమెట్లలో వరుస అగ్ని ప్రమాదాలు..ఎగసిపడుతున్న మంటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



