– సీఐటీయూ నేత అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
“ఆశా” లకు స్థిరమైన కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని,వీరిని కార్మికులకు గుర్తించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. మంగళవారం వినాయక పురం,ప్రాజెక్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నాగమణి,తిరపతమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అర్జున్ మాట్లాడుతూ ఆశా వర్కర్లను స్వచ్చంద సేవకులుగా కాకుండా రెగ్యులర్ వర్కర్ లుగా గుర్తించాలని,45,46 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సులు అమలు చేయాలని,స్కీం కార్మికుల కోసం పే కమిషన్ నియమించాలని అన్నారు.
ప్రస్తుత కేంద్ర బడ్జెట్ ఆరోగ్య రంగానికి వున్న నిధులు తగ్గించి ఆశ వర్కర్లకు వేతనాలకు పెంచకుండా చేసిందని అన్నారు.ఆశా వర్కర్లను శాశ్వత ఆరోగ్య కార్యక్రమం పథకంగా నిర్ణయించాలని,దేశవ్యాప్తంగా ఒకే విధమైన పని పరిస్థితులు అమల్లోకి తేవాలని,ఈనెల 12 న జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో సుజాత, సమత,రత్నకుమారి,బుల్లెమ్మ, రాధ,సునీత తదితరులు పాల్గొన్నారు.



